Kristen Stewart: రెండేళ్లుగా సహానటితో ట్విలైట్‌ హీరోయిన్‌ డేటింగ్..! సీక్రెట్ ఎంగేజ్ మెంట్..త్వరలోనే పెళ్లి!

-

Kristen Stewart: హాలీవుడ్ బ్యూటీ, ‘ద ట్విలైట్‌ సిరీస్‌’ ఫేమ్‌ క్రిస్టెన్‌ స్టెవార్ట్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. కో యాక్ట‌ర‌స్ డైలాన్‌ మేయర్‌తో నిశ్చితార్థం చేసుకుని త‌న అభిమానుల‌కు షాక్ ఇచ్చింది. ఈ క్ర‌మంలో తామిద్ద‌రం రెండేళ్లు నుంచి డేటింగ్ లో ఉన్నామ‌ని, త్వ‌ర‌లోనే వివాహం చేసుకోబోతున్నామ‌ని చెప్పి అంద‌రిని ఆశ్చ‌ర్య ప‌రిచింది. గత నాలుగులు సంవ‌త్సారాలు ఈ ఇద్ద‌రూ హాట్ బ్యూటీలు లివింగ్ రిలేష‌న్ లో ఉన్నార‌ని, గ‌తంలోనే వారిద్ద‌రూ ర‌హస్యంగా పెళ్లి చేసుకున్నార‌ని అనేక పుకార్లు వ‌చ్చాయి. అయినా.. ఆ పుకార్ల‌పై ఎన్నాడు కూడా స్పందించ‌లేదు. తమ రిలేషన్‌షిప్‌ గురించి ఈ ఇద్ద‌రూ ఓపెన్ అయిన సంద‌ర్భాలు లేవ్‌. అయితే తాజాగా క్రిస్టెన్‌ చేసిన ప్రకటనతో ప్రేక్ష‌కులు దిమ్మ‌తిరిగింది.

ఈ హాట్ బ్యూటీ ట్విలైట్ సాగా సిరీస్ ద్వారా తెలుగు వారికి సుపరిచితమే. తాజాగా ఆమె ఓ షో కి గెస్ట్ గా
వెళ్లింది . ఈ క్రమంలో న‌టి డైలాన్ తో ఉన్న రిలేష‌న్ పై పెద‌వి విప్పింది. స్టెవార్ట్‌ మాట్లాడుతూ..
సమాజానికి ఈ విష‌యాన్ని చెప్పాడానికి చాలా ఒత్తిడిని లోన‌య్యాన‌నీ, కానీ తాను ఎల్ జీబీటీక్యూ క‌మ్యూనిటీకి చెందిన దాన్ని అని ఎప్పుడూ ఫీల్ కాలేద‌ని.. డైలాన్ తో క‌లిసి చాలారోజులు బయట తిరిగాన‌నీ, త‌మ పెళ్లికి ఇంట్లో వ్యతిరేకత ఉన్నా.. తమకు నచ్చిన వారితో ఉంటె జీవితం సాఫీగా సాగుతుందనే నమ్మకంతో తన సహనటినే వివాహం చేసుకోనున్నట్లు ఆమె తెలిపింది. మేం ఒకరికోసం ఒకరం జీవించాలని కోరుకుంటున్నామ‌ని స్ప‌ష్టం చేసింది.

స్టెవార్ట్ సినీ కెరీర్ ను ప‌రిశీలిస్తే.. సినిమాల ద్వారా అత్యధికంగా డ‌బ్బు సంపాదిస్తున్న హీరోయిన్స్ స్టెవార్ట్‌ కూడా ఒకరు. బాల న‌టిగా హాలీవుడ్ ఏంట్రీ ఇచ్చింది. ‘ప్యానిక్‌ రూమ్‌’, ‘స్పీక్‌’, ‘ఇన్‌ టు ద వైల్డ్‌’, ‘ద ట్విలైట్‌ సాగా సిరీస్‌’, ‘ఛార్లీస్‌ ఏంజెల్స్‌’ వంటి సినిమాల్లో అద్భుతంగా న‌టించి.. మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్ర‌ధానంగా ‘ద ట్విలైట్‌ సాగా సిరీస్‌’ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక న‌టి డైలాన్‌ మేయర్‌ విషయానికొస్తే ఆమె కూడా ఒక నటి. ‘మోక్సీ, ‘రాక్‌ బాటమ్‌’, ‘మిస్‌ 2059’ చిత్రాలతో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version