ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం ఊరిస్తూ వస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ అంశంపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఎన్నికల సమయంలో జిల్లాల పునర్వ్యవస్థీరకరణపై వైఎస్ జగన్ హామీ కూడా ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక అనేక హామీలను అమలు చేస్తూ వస్తున్నారు. అయితే అత్యంత కీలకమైన కొత్త జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడు శ్రీకారం చు డతారన్నది ఆసక్తికరంగా మారింది.
పాలనా సౌలభ్యంతోపాటుగా వ్యాపార, వాణజ్య, రియల్ ఎస్టేట్, విద్య, ఉద్యోగాల కల్పన పరంగా కొత్త జి ల్లాల ఏర్పాటు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజా పరిస్థితులు గమనిస్తుంటే ఇప్పట్లో కొత్త జిల్లాల ఏర్పాటు చేసే అవకాశం ఇప్పట్లో కనిపించడం లే దు. గతంలో అనుకున్న ప్రకారం జనవరి 26న కొత్త జిల్లాలు ఏర్పాటు కావాల్సి ఉండగా,, ఆ సమయానికి జిల్లాలు ఏర్పడే అవకాశమేలేదు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ కొద్ది సమమయంలో జిల్లాల విభజన జరగడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు.
రాజకీయ నాయకుల లెక్కలు, ప్రజల కోరిక, ప్రాంతాల మధ్య సమతూకం, జిల్లా కేంద్రంతో అ నుసంధానం వంటి అనేక విషయాలను పరిగణకు తీసుకుని, విభజన చేయాల్సి ఉంటుంది. గతంలో మండల కేంద్రాల ఏర్పాటు తరువాత చాలా ఏళ్ల పాటు ప్రజల నుంచి ఆందోళన లు తప్పలేదు. కేవలం మండలాల ఏర్పాటు కే ఇంత జరిగితే జిల్లాల ఏర్పాటు అంటే ఇంకా జనాల పట్టింపులు చాలా ఉంటాయి.
అదే కాక ఓ జిల్లాను రెండుగా, మూడుగా విడదీయడం అంత సులువైన పని కాదు. ముందుగా ఓ కమిటీ వేసి, అది అన్ని జిల్లాలు పర్యటించి, కసరత్తు చేసి, ప్రజా ప్రతినిధులతో చర్చించి, అ ప్పుడు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంతా చాలా సమయంతో కూడిన వ్యవహారం. ఈక్రమంలోనే పంచాయతీ ఎన్నికల తరువాతే జిల్లాల విభజన ఉంటుందని మంత్రులు పేర్కొంటున్నారు.
అలా అయితే ఇంకా దూరం పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు పంచాయతీ ఎన్నికలు జరుపుతారా ? అన్నది కూడా అనుమానమే.. అమ్మ ఒడి పథకం అమలు చేయడం, ఇసుక సమస్య పరిష్కరించడం వంటి ఒకటి రెండు కీలక విషయాలు పూర్తి అయిన తరువాత కానీ పంచాయతీ ఎ న్నికలకు వెళ్లకపోవచ్చు. అందువల్ల ఇప్పట్లో జిల్లాల ఏర్పాటు సాధ్యం కాకపోవచ్చు.