బంజారాహిల్స్ లో డ్రగ్స్ బండారం బయటకు రావడం వెనుక చాలా రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఉగాది రోజు పంచాగ శ్రవణం కూడా ఇదే అర్థం ధ్వనింపజేసింది.అయితే పంచాంగకర్త ఉద్దేశం ఎలా ఉన్నా కూడా మీడియాకు ఓ హాట్ టాపిక్ దొరికింది. దీంతో అంతా అటుగా ఆలోచించండి బ్రేకింగ్ న్యూస్ కోసం తెగ ఆత్ర పడడం నిన్నటి నుంచి రేపటి వరకూ జరిగే తంతు! దీనిని ఎవ్వరూ నియంత్రించలేరు కానీ జరిగిందేంటి అన్నది ఇప్పుడు చర్చకు తూగాల్సిన విషయం. ఈ తరహా రచ్చను నియంత్రించాల్సిన వారెవ్వరు ? సరే మీడియాకు అతి మామూలే కనుక ఆ సంగతి అటుంచి ఆలోచించినా కేసీఆర్ ఉద్దేశం ఏంటి ?
ఇప్పటికే తెలంగాణ జాగృతి స్పందిస్తోంది. అదేవిధంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ లీడర్లంతా కూడా స్పందిస్తున్నారు. తప్పు చేస్తే శిక్షించాల్సిందే అని మీడియా ముఖంగా చెబుతున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సింగర్ రాహుల్ కూడా ఇదే మాట మరియు పాట పాడుతున్నారు. ఆయనైతే ఏకంగా గతంలో తెలంగాణ పోలీసు పిలుపు మేరకు డ్రగ్స్ ఫ్రీ హైద్రాబాద్ ప్రొగ్రాం కుక వెళ్లి పాట కూడా పాడి వచ్చారు.కానీ ఆయన కూడా ఇదే మాట అంటున్నారు. నేను అమాయకుడ్ని నేను అపరాధిని అని..ఇదే మాట దొరికిన 150 మంది, దొరకాల్సిన మరో 150 మంది కూడా చెబుతూనే ఉన్నారు ఉంటారు కూడా! అయితే తప్పుజరగకుండా 12 గ్రాముల కొకైన్ పబ్బులో ఎలా దొరికింది. పాపం ఎవ్వరో గుర్తు తెలియని వాళ్లు ఇక్కడికి తెచ్చి పడేశారు. ఆ విధంగా వీళ్లంతా తమకు తెలియకుండానే ఈ కేసులో ఇరుక్కుపోయారు అని అనుకోవాలా?
డ్రగ్స్ కేసులో కేసీఆర్ రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయా ? #CMKCR #Telangana #DrugsCase
— Manalokam (@manalokamsocial) April 4, 2022
ఇంతకూ ఈ కేసులో దాగి ఉన్న రాజకీయ ఉద్దేశాలేంటి? వాస్తవానికి ఈ కేసు అనే కాదు ఏ కేసు అయినా సెలబ్రిటీల విషయమై కొన్ని రాజకీయ ఉద్దేశాలు పోగుబడి ఉంటాయి. ఓ విధంగా కాంగ్రెస్ మరియు బీజేపీ లీడర్లు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కనుక తమకు కానీ తమ బిడ్డలకు కానీ ఏ పాపం తెలియదనే అంటారు. కేసీఆర్ కనుక ఈ కేసును సమర్థంగా వినియోగించుకుని, సిసలు దోషులెవ్వరు అన్నది పట్టుకునేందుకు పోలీసుకు సరైన డైరెక్షన్ ఇస్తే ఇక ఈ తగాదాలో మూలాలు
ఏంటన్నవి తప్పక తెలుస్తాయ్. ఆ విధంగా చీకటి వ్యవహారంలో ఉన్న పెద్దల హస్తం ఎంతన్నది వెలుగు చూడడం ఖాయం.అందాక ప్రస్తుతానికి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో కొందరు తప్పు చేయకున్నా గుంపులో ఉన్నారు కనుక అభియోగాలు కానీ అభాండాలు కానీ మోయక తప్పదు. ఈ కథలో నింద ఏది ? నిజం ఏది ?