బోల్తా పడిన ట్యాంకర్‌లో ఇంధనం కోసం వెళ్లి.. ఇద్దరు దుర్మరణం

-

మధ్యప్రదేశ్ ఖర్గోన్‌ జిల్లాలో ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఓ ఇంధన ట్యాంకర్ బోల్తా పడింది. ఇంధనాన్ని తీసుకొచ్చుకునేందుకు వెళ్లిన ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇవాళ ఉదయం ఆరు గంటల సమయంలో ఇండోర్‌ నుంచి ఖర్గోన్‌ వైపు వెళ్తున్న ఇంధన ట్యాంకర్‌ అంజన్‌గావ్‌ గ్రామం సమీపంలో మూల మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. దాంతో సమీప గ్రామస్థులు ఇంధనాన్ని ఎత్తుకెళ్లేందుకు ఎగబడ్డారు. అదే సమయంలో ట్యాంకర్‌లో మంటలు చెలరేగడంతో అక్కడికక్కడే ఇద్దరు సజీవదహనమయ్యారు.

మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. గాయపడిన వారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఇండోర్‌కు తరలించారు. మరో 10 మంది క్షతగాత్రులు ఖర్గోన్‌ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version