BREAKING : నాగోల్‌ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన కేటీఆర్..వచ్చే ఏడాది మరో 4 ఫ్లై ఓవర్లు

-

BREAKING : నాగోల్‌ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. రూ.143 కోట్ల వ్యయంతో 990 మీటర్ల పొడవున నాగోల్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణం చేశామని..దీంతో ఎల్బీ నగర్ – సికింద్రాబాద్‌ రూట్‌లో ట్రాఫిక్‌ కష్టాలు తొలగనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చిలోగా మరో నాలుగు ప్రాజెక్టులు పూర్తవుతాయని.. ఎల్బీనగర్ లో రహదారుల అభివృద్ధికి రూ.700 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు.

దేశంలో హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని.. ఈ నగరాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. వరల్డ్ గ్రీన్ సిటీగా హైదరాబాద్ కు అవార్డు రావడం గర్వకారణమని.. మౌళిక వసతుల సమస్యను పరిష్కరిస్తున్నామన్నారు.ఎల్బీనగర్ లో రిజిస్ట్రేషన్ల సమస్యను నాలుగు రోజుల్లో పరిష్కరిస్తామని.. రాజకీయాలు ఎన్నికలు వచ్చినప్పుడు చేద్దామని పేర్కొన్నారు. ప్రజల అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులందరం కలిసి పనిచేద్దామని పేర్కొన్నారు కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version