ల‌వ‌ర్ కోసం దారుణంగా కొట్టుకున్న వైజాగ్ గ‌ర్ల్స్‌

-

ఈ మ‌ధ్య కాలంలో… ల‌వ్ ఎఫైర్లు విప‌రీతంగా పెరిగి పోయాయి. వ‌య‌సుతో సంబంధం లేకుండా… ల‌వ్ చేసుకుంటున్నారు ప్ర‌స్తుత యూత్. కొంత మంది ప్రేమించి.. పెళ్లిచేసుకుంటుంటే.. మ‌రికొంత మంది విడిపోతున్నారు. అయితే.. తాజాగా బాయ్ ఫ్రెండ్ కోసం ఇద్దరు అమ్మాయిలు రోడ్డుపైనే జుట్టు పట్టుకుని కొట్టుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఘటన వివరాల్లోకి వెళితే… విశాఖపట్నం అనకాపల్లి ఆర్టీసీ బస్టాండ్ లో బూతులతో రెచ్చిపోయిన ఇద్దరు ఆడపిల్లలు… అందరూ చూస్తుండగానే తనుక్కున్నారు. ఒక‌రి జుట్టు మ‌రొక‌రు ప‌ట్టు కుని.. సినిమా లెవ‌ల్ ల్లో కొట్టుకున్నారు. ఒక అబ్బాయి కోసం ఈ కాలేజీ స్టూడెంట్స్ ఇద్దరు కొట్టుకుంటున్నార‌ని తెలిసి అందరూ షాక్ కు గురయ్యారు. ఇక ఈ విష‌యం తెలియ‌డం తో రంగంలోకి దిగారు పోలీసులు. అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు…. ఇద్దరు అమ్మాయిలతో పాటు వారి బాయ్ ఫ్రెండ్ ను కూడా తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version