వాట్సాప్ లో మరో రెండు కొత్త ఫీచర్లు

-

వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అందిస్తూ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. వాట్సాప్ కి పోటీగా చాలా యాప్స్ వచ్చినప్పటికీ అవేవి మార్కెట్లో వాట్సప్ కి పోటీ ఇవ్వలేకపోయాయి. యూజర్స్ అవసరాలు, అభిరుచిని బట్టి వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ ఇవ్వటమే ఇందుకు కారణమని చెప్పచ్చు. తాజాగా వాట్సాప్ నుండి మరో కొత్త అప్డేట్ వచ్చింది.

వాట్సాప్లో పీపుల్ నియర్ బై, క్విక్ స్టేటస్ రియాక్షన్ అనే రెండు ఫీచర్లు రాబోతున్నాయి. పీపుల్ నియర్ బై ఫీచర్ ద్వారా మీకు దగ్గర్లో ఉన్న వారితో ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు. దీనికోసం సెట్టింగ్స్ ‘పీపుల్ నియర్ బై’ పై క్లిక్ చేసి కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇక క్విక్ స్టేటస్ రియాక్షన్ ఫీచర్ ద్వారా స్టేటస్ చూసిన దగ్గరే ఎమోజీలతో రియాక్ట్ అవ్వొచ్చు. ఆ రియాక్షన్స్ చాట్లో కాకుండా స్టేటస్ దగ్గరే కనిపిస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version