అక్కడ ట్యాటూ వేసుకుంటే ప్రమాదమా..?

-

ఒక్కప్పుడు ట్యాటూ ( పచ్చబొట్టు) కేవలం చేతులపై ప్రేమతో తల్లిదండ్రుల పేర్లు, భక్తితో దేవుడి బొమ్మలను పొడిపించుకునేవారు. అప్పుడు కేవలం అలివ్‌ గ్రీన్‌లోనే ఉండేవి. ప్రస్తుతం ట్యాటూ సౌంధర్య సాధనంగా మారడంతో ఏ రంగు అంటే ఆ రంగుల్లో వేస్తున్నారు. వీటితో శరీరానికి అందం వస్తుందన్న మాట పక్కన పెడితే జాగ్రత్తలు పాటించకపోతే కొన్ని జబ్బులు అంటుకునే ప్రమాదం కూడా ఉందంటున్నారు చర్మవ్యాధుల నిపుణులు.

పరిణామాలివే..

ట్యాటూ వేసేవారు ఓ పరికరంతో రంగురంగుల ద్రవ్యాలను శరీర పొరల్లోకి జొప్పిస్తారు. ఈ క్రమంలో అప్పుడప్పుడు తీవ్రరక్తస్రావం కూడా కావచ్చు.వారు వాడే సూదులను పరిశుభ్రంగా కడగకపోవడంతో హైపటైటిస్‌ బి, సి వంటి ఇన్‌ఫెక్షన్లు సోకేందుకు ఆస్కారం ఉంటుంది. కొన్ని ద్రవ్యాల్లో లోహాలుండటంతో ఎప్పుడైన ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఎంఐఆర్‌ తీసేటప్పుడు తీవ్రమైన నొప్పితో పాటు ఎంఆర్‌ఐ ఫలితాలు కచ్చితంగా రాకపోవచ్చు. శరీర పొరల్లోకి రంగులను జొప్పించడంతో చెమట గ్రంథుల పనితీరు సక్రమంగా పని చేయక చెమట ఉత్పత్తి సగానికి తగ్గిపోవచ్చు. క్రీడకారులు పెద్దపెద్ద ట్యాటూ లు వేసుకోవడంతో వీరిపై అధిక ప్రభావం చూపుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొందరికి నీలి, ఆకుపచ్చ, ఏరుపు రంగుల మూలంగా అలర్జీ మొదలై దురదు పుడుతుంది.

ఇలా చేయాలి..

ట్యాటూ వేసేవారు ముందుగా చేతులు శుభ్రంగా కడుక్కొని తప్పకుండ గ్లౌజ్‌లు ధరించాలి. స్టెరిలైజ్‌ చేసిన పరికరాన్నే వాడాలి. ట్యాటూ వేసుకున్న తర్వాత శరీరానికి అత్తుకునే డ్రస్సులు ఏమాత్రం వేసుకోరాదు. ట్యాటూ వేసుకున్న భాగంలో దుమ్మూ, ఎండ పడకుండా చూసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version