ఉగాది పంచాంగం : శ్రీ శార్వరీ నవనాయకులు వీరే !

-

శ్రీ శార్వరీ నామ సంవత్సరం ఉగాది. నేటి నుంచి కొత్త తెలుగు సంవత్సరం ప్రారంభం, అయితే ఈ ఏడాది నవనాయకులు ఎవరు? వారిచ్చే ఫలితాలు గురించి పండితులు చెప్పిన వివరాలు…

శ్రీ శార్వరీ సంవత్సరం మార్చి 25న ప్రారంభమై 2021 ఏప్రిల్ 12న ముగుస్తుంది.

రాజు- బుధుడు,
మంత్రి- చంద్రడు,
రవి – సేనాధిపతి
శని – రసాధిపతి
గురువు- నీరసాధిపతి
బలరాముడు-పశుపాలకుడు
గురువు- పురోహితుడు
బుధుడు-పరీక్షకుడు
చంద్రుడు – గ్రామపాలకుడు
చంద్రుడు – అశ్వాధిపతి
గురువు- దేవాధిపతి
రవి- వస్త్రాధిపతి
చంద్రుడు – రత్నాధిపతి
రవి – మృగాధిపతి

ఈ ఏడాది నవనాయక ఫలాల ప్రకారం ఈ శ్రీ శార్వరీ నామ సంవత్సరం 60 తెలుగు సంవత్సరాలలో 34వది. ఏ సంవత్సరానికి అధిపతి కుజుడు, ప్రపంచం అంతా ధనధాన్యములకు కొరత ఏర్పడుతుంది. ఆహారధాన్యములు ధరలు అందుబాటులో ఉండవు. అకాల వర్షాలు ఉంటాయి. సమాజానికి రోగపీడలు ఉంటాయి. ప్రభుత్వాల మధ్య తీవ్రకలహాలు ఏర్పడి ప్రజాహాని సంభవిస్తుంది. పశ్చిమదేశాలలో సంక్షోభం, తూర్పుదేశాలు మాత్రం సుభిక్షంగా ఉంటాయి.

తుంగభద్రానది పుష్కరం – ఏ సంవత్సరం తుంగభద్రానది పుష్కరం వస్తుంది. నవంబర్ 20వ తేదీ ఇవి ప్రారంభమవుతాయి. గురువు మకరరాశిలో ప్రవేశించడంతో తుంగభద్రానదికి పుష్కారలు వస్తున్నాయి.

-శ్రీ

Read more RELATED
Recommended to you

Exit mobile version