యాక్షన్ థ్రిల్లర్ “ఉగ్రం”, ఫస్ట్ లుక్ రిలీజ్

-

కెరీర్లో యాబై ఆరు చిత్రాలు చేసి తనకంటూ ఓ ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అల్లరి నరేష్ హాస్య కథానాయకుడిగా చక చక 50 సినిమాలకు పైగా పూర్తి చేసుకున్న హీరో. అప్పుడప్పుడు ఆయన విలక్షణమైన పాత్రలను కూడా చేస్తూ తన సత్తా చాటుకున్నాడు. అలా ఆ మధ్య వచ్చిన ‘నాంది’ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది.

నూతన దర్శకుడు విజయ్ కనకమెడలకు ఈ సినిమా మంచి పేరు తీసుకుని వచ్చింది. అదే దర్శకుడుతో అల్లరి నరేష్ ఇప్పుడు ‘ఉగ్రం’ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ఆయన పోస్టర్ ను రిలీజ్ చేశారు.

వీపులో దిగబడిన ‘కత్తి’తో, రక్తసిక్తమైన శరీరంతో, ఆవేశం, ఆక్రోషంతో హీరో అరుస్తున్నట్టుగా ఈ పోస్టర్ లో కనిపిస్తున్నారు. మొత్తానికి టైటిల్ కి తగిన పోస్టర్ వదిలారు. సాహు గారపాటి – హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చాడు. ‘నాంది’ తర్వాత అదే కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఉంది. ‘నాంది’ స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకులను ప్రభావితం చేస్తుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version