తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఎందరు ఉన్నా కొందరు ముఖాన మాత్రం వీరికి ఇలాంటి కథలు మాత్రమే నప్పుతాయి అని ఒక స్టాంప్ వేసి ఉంటుంది. అటువంటి హీరోలకి ఒకరే అల్లరి నరేష్… తన కెరీర్ లో నిన్న మొన్నటి వరకు కామెడీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే వాడు. కానీ సడన్ గా మహర్షి సినిమాలో మహేష్ బాబుకు ఫ్రెండ్ గా సీరియస్ పాత్ర చేసి అందరినీ మెప్పించాడు. అప్పటి నుండి కొత్త పాత్రలు చేస్తూ తనకంటూ మరో ట్రెండ్ ను సృష్టించాడు. ఆ తర్వాత నాంది సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఆ తర్వాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాతో ఏవరేజ్ గా నిలిచాడు. ఇప్పుడు తాజాగా నరేష్ నటించిన చిత్రం ఉగ్రం.. టైటిల్ ను చూసినప్పుడే ఇది ఎంత సీరియస్ సినిమానో అర్ధం అవుతోంది.
“ఉగ్రం” ట్రెయిలర్ ఔట్… నరేష్ ఫ్యాన్స్ కు పూనకాలే !
-