కరోనా కొత్త స్ట్రెయిన్ దెబ్బకు యూకే వణికిపోతోంది. నిజానికి అన్ని దేశాల కంటే ముందే టీకా పంపిణీ ప్రారంభించినా.. కొత్త స్ట్రెయిన్ కారణంగా బ్రిటన్ వ్యాప్తంగా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ దెబ్బకు ఇంగ్లండ్ వ్యాప్తంగా మళ్లీ లాక్‌డౌన్ విధించారు ఆ దేశ ప్రధాని. అందులో భాగంగా రేపటి నుంచి అన్ని పాఠశాలలు, కళాశాలలు పూర్తిగా బంద్ అవుతాయని ప్రకటించారు.
నిజానికి గత కొద్దికాలంగా ఇంగ్లండ్‌లో కఠిన ఆంక్షలు విధించారు. అయినప్పటికీ కేసుల సంఖ్య తగ్గని నేపధ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అంతే కాక కోవిడ్ ఫస్ట్ వేవ్ కంటే ఇప్పుడు పరిస్థితి మరింత దారుణంగా ఉందని చెబుతున్నారు. కొత్త స్ట్రెయిన్ కారణంగా అక్కడ మరణాలు కూడా పెరుగుతున్నాయని అంటున్నారు. అనుకే లాక్ డౌన్ లో భాగంగా కఠిన నిబంధనలు విధించింది ప్రభుత్వం. నిత్యవసర వస్తువులు, మెడిసిన్ కోసం మాత్రమే బయటికి రావాలని ప్రభుత్వం పేర్కొంది.