రష్యాపై ఈనెల 7,8న అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ

-

ఉక్రెయిన్- రష్యాల మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. యుద్ధం ఏడో రోజుకు చేరకుంది. రోజులు గడిచే కొద్ధి యుద్ధం మరింత భీకరంగా మారుతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను వశపరుచుకునేందుకు రష్యన్ ఆర్మీ ప్రయత్నిస్తోంది. పెద్ద ఎత్తున క్షిపణులతో కీవ్, ఖర్కీవ్ నగరాలను టార్గెట్ చేస్తోెంది రష్యా. యూరోపియన్ యూనియన్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలు ఎన్ని ఆంక్షలు పెట్టినా.. తగ్గదే లేదు అంటోంది రష్యా. మరోవైపు ఉక్రెయిన్ సేనలు రష్యాను నిలువరిస్తున్నాయి. 

ఇదిలా ఉంటే రష్యా- ఉక్రెయిన్ సంక్షోభంపై అంతర్జాతీయ న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ సంక్షోభంపై ఈనెల 7,8 తేదీల్లో విచారణ జరగనుంది. రష్యా, ఉక్రెయిన్ సంక్షోభంపై ఈనెల 7,8న అంతర్జాతీయ న్యాయస్థానం బహిరంగ విచారణ నిర్వహించనున్నట్లు తెలిపింది. తమపై రష్యా మారణహోమానికి పాల్పడిందంటూ.. ఉక్రెయిన్ ఐసీజే తలుపు తట్టింది. అమాయకమైన పౌరులను చంపుతూ.. మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుందంటూ.. ఉక్రెయిన్ అంతర్జాతీయ న్యాయస్థానంలో ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో వారం రోజుల్లో విచారణ ప్రారంభం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. తాజాగా విచారణకు సిద్ధమైంది ఐసీజే.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version