రష్యా- ఉక్రెయిన్ ల మధ్య దాడులు తీవ్ర రూపం దాల్చాయి. ఈ రోజు ఉదయం ప్రారంభం అయిన రష్యా దాడులు మెల్లిగా.. అన్ని ప్రధాన నగరాల్లో దాడులకు పాల్పడుతోంది రష్యన్ ఆర్మీ. ఇప్పటికే 13 ఉక్రెయిన్ నగరాల్లో బాంబు దాడులు చేస్తోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో దాడులు చేస్తోంది.
ఇదిలా ఉంటే… ఉక్రెయిన్ ఎయిర్ బేస్ లను, ఎయిర్ ఢిపెన్స్ సిస్టమ్స్ ను ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది. ఇదే సమయంలో రష్యాకు చెందిన 5 ఫైటర్ జెట్లను, ఓ హెలికాప్టర్ ను కూల్చి వేశామని ఉక్రెయిన్ ప్రకటించింది. యుద్ధం నేపథ్యంలో రాజధాని కీవ్ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు బయటి ప్రాంతాలకు వెళ్తున్నారు.