మరోమారు ఉక్రెయిన్ కు ఝలక్ ఇచ్చింది ఇండియా. రష్యాకు వ్యతిరేఖంగా ఐక్యరాజ్య సమితి మానవహక్కుల మండలి ఓటింగ్ కు గైర్హాజరు అయింది. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ ఫలితంగా స్వతంత్ర అంతర్జాతీయ విచారణ కమిషన్‌ను అత్యవసరంగా ఏర్పాటు చేయాలని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో శుక్రవారం జరిగిన ఓటింగ్‌కు భారత్ గైర్హాజరైంది. ఇప్పటికే యూఎన్ఓ నిర్వహించి భద్రతా మండలి సమావేశంలో, జనరల్ అసెంబ్లీ సమావేశంలో భారత్ తటస్థంగా ఉంది.
ప్రస్తుతం ఉక్రెయిన్ లో మానవ హక్కుల పరిస్థితిపై ముసాయిదా తీర్మాణంపై 47 మంది సభ్యులు కౌన్సిల్ లో 32 దేశాలు తీర్మాణానికి అనుకూలంగా ఓటేయగా… 2 దేశాలు వ్యతిరేఖంగా.. 13 దేశాలు గైర్హాజరు అయ్యాయి. గైర్హాజరు అయిన దేశాల్లో భారత్, పాకిస్తాన్, చైనా, వెనుజులా మొదలైన దేశాలు ఉన్నాయి. వ్యతిరేకంగా రష్యా, ఎరిట్రియా దేశాలు ఓటేశాయి. అనుకూలంగా ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, నేపాల్, యూఏఈ, యూకే, అమెరికా దేశాలు ఓటింగ్ చేశాయి. గత వారంలో 15 దేశాల భద్రతా మండలిలో ఉక్రెయిన్‌పై రెండు తీర్మానాలు, 193 మంది సభ్యుల జనరల్ అసెంబ్లీలో ఒక తీర్మానానికి భారత్ గైర్హాజరైంది.