బాలీవుడ్‌ కండలవీరుడితో ప్రేమలో బుట్టబొమ్మ..?

-

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ .. బుట్టబొమ్మ పూజా హెగ్డేతో ప్రేమలో పడ్డారట. ప్రస్తుతం వీళ్లిద్దరూ డేటింగ్‌లో ఉన్నారట. కలిసి సమయాన్ని గడుపుతున్నారట. ఓవర్సీస్ సెన్సార్ బోర్డు మెంబర్‌నని, అత్యంత వివాదాస్పద సినీ విమర్శకుడినని చెప్పుకునే ఉమైర్ సంధు.. ట్విట్టర్ ద్వారా సల్మాన్ ఖాన్-పూజా హెగ్డే ప్రేమాయణం గురించి వెల్లడించాడు. బ్రేకింగ్ న్యూస్ అంటూ ట్వీట్ చేశాడు. పూజ సినీ కెరీర్ బాలీవుడ్ నుంచే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ కామియో రోల్ లో నటిస్తున్నారు.

మరోవైపు, పూజా హెగ్డే పర్సనల్ లైఫ్ గురించి బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పూజా హెగ్డే, సల్మాన్ ఖాన్ మధ్య అఫైర్ కొనసాగుతోందని ఆయన ట్వీట్ చేశారు. పూజ ప్రేమలో సల్మాన్ పడిపోయాడని.. ప్రస్తుతం ఇద్దరూ కలిసి ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారని చెప్పారు. సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్స్ పూజకు మరో రెండు సినిమాల్లో అవకాశం ఇచ్చిందని తెలిపారు. ఈ విషయం సల్మాన్ కు అంత్యంత సన్నిహిత వర్గాల నుంచి తనకు తెలిసిందని చెప్పారు. సల్మాన్ కు హీరోయిన్లతో అఫైర్లు కొత్తేమీ కాదు. ఐశ్వర్య రాయ్ తో పాటు పలువురు హీరోయిన్లతో ప్రేమాయణాలు నడిపారు. ఇప్పుడు పూజతో అఫైర్ నిజమేనా? అనే విషయంపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version