ఏపీలో ఇప్పుడే అసలు రాజకీయాలు మొదలయ్యాయి – ఉండవల్లి

-

ఏపీలో ఇప్పుడే అసలు రాజకీయాలు మొదలయ్యాయన్నారు మాజీ ఎం.పి. ఉండవల్లి అరుణ్ కుమార్. ఎం.పి.గా ఉండగా ఇంత ఇలా రాజకీయం చేయలేదని అన్నారు. రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు అసెంబ్లీలో మాట్లాడిన అంశాలపై గోదావరి గళం పుస్తకాన్ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ ఆవిష్కరించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2004-2014 మధ్య రాజమండ్రి ఎమ్మెల్యే గా పనిచేసిన రౌతు సూర్యప్రకాశరావు అందించిన సేవలను అభినందించారు. ఈ సందర్భంగా ఉండవల్లి మాట్లాడుతూ రాజకీయాలు అంటే ఓ వ్యసనం అన్నారు. రాజకీయ పార్టీల నుండి వైదోలగిన నేటికి రాజకీయ నాయకుడిగానే కొనసాగుతున్నానని అన్నారు. ఓటమికి కుమిలిపోకుండా పోరాడితే ఫలితాలు ఉంటాయని వ్యాఖ్యానించారు. ఇక నుంచి ఏపీ రాజకీయాలు చాలా రసవత్తరంగా ఉంటాయని పేర్కొన్నారు మాజీ ఎం.పి. ఉండవల్లి అరుణ్ కుమార్.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version