లోక్ సభ ఎన్నికల్లో నిరుద్యోగమే ప్రధాన అంశం : మల్లికార్జున ఖర్గే

-

ప్రస్తుతం జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో దేశంలో బీజేపీ సృష్టించిన నిరుద్యోగమే ప్రధాన అంశంగా మారిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. యువత ఉద్యోగాల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ రేటు మూడు రేట్లు పెరిగిందని వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్లో పోస్ట్ చేశారు. ఉద్యోగాల కోసం దేశ యువత ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారని తెలిపారు. ‘దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలు, ఐఐటీలు, ఐఐఎంల విషయానికొస్తే 12 ఐఐటీల్లో దాదాపు 30 శాతం మంది విద్యార్థులు రెగ్యులర్ ప్లేస్మెంట్లు పొందడం లేదు.

21 ఐఐఎంలలో కేవలం 20శాతం మాత్రమే సమ్మర్ ప్లేస్మెంట్లు పూర్తి చేయగలిగాయి. ఐఐటీలు, ఐఐఎంలలోనూ పరిస్థితి ఇలా ఉంటే దేశవ్యాప్తంగా యువత భవిష్యత్తును బీజేపీ ఎలా నాశనం చేసిందో ఊహించుకోవచ్చు’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో రూపొందించి యువ న్యాయ్ ద్వారా యువత భవిష్యత్కు నూతన మార్గాలను తెరుస్తామన్నారు. 2కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన మోడీ దానిని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. దీనివల్ల యువత ఆశలు నెరవేర లేదని తెలిపారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ‘పెహ్లి నౌక్రి పక్కి’ హామీని మేనిఫెస్టోలో పెట్టిందని.. అధికారంలోకి రాగానే దానిని తప్పకుండా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version