BREAKING : ఇవాళ మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినేట్‌ సమావేశం..కిసాన్‌ సమ్మాన్‌ నిధుల పెంపు!

-

BREAKING : ఇవాళ ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినేట్‌ సమావేశం జరుగనుంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఈ కేంద్ర మంత్రివర్గం సమావేశం ప్రారంభం కానుంది. అయితే.. ఈ కేంద్ర కేబినేట్‌ సమావేశంలో.. ముఖ్యంగా బడ్జెట్‌ పై చర్చించే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం అందుతోంది. అలాగే… ఇప్పుడు జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలనే దానిపై కూడా కేంద్ర కేబినేట్‌ చర్చించే చాన్స్‌ ఉంది.

అటు కరోనా కేసులు తీవ్రత, ఒమిక్రాన్‌ వ్యాప్తిపై కూడా ప్రధాని మోడీ చర్చించే ఛాన్స్‌ ఉంది. ఇక రెండో దశ పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రతి పక్షాలను ఎలా ఎదుర్కొవాలనే దానిపై కేంద్ర కేబినేట్‌ చర్చించే ఛాన్స్‌ ఉంది. ముఖ్యంగా రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో.. రైతులకు నేరుగా నిధుల సాయాన్ని చేసేందుకు కేంద్రం నిర్నయం తీసుకునే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధులను పెంచే ఛాన్స్‌ ఉన్నట్లు కూడా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version