మాఫియా డాన్ దావుద్ బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు

-

అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీంపై ఈడీ గురిపెట్టింది. ముంబైలోని దావుద్ ఇళ్లపై ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు. మనిలాండరింగ్ కేసుల్లో భాగంగా ఈడీ ఈ సోదాలను చేపడుతోంది. ముంబైలోని దావుద్ ఇబ్రహీంపై సంబంధీకులు ఇళ్లలో దాడులు చేసింది. ముంబై చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు ఈడీ అధికారులు. ఈ మధ్యనే దావుడ్ ఇబ్రహీంపై ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసులు నమోదు చేశారు. 

ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన ఓ రాజకీయ నాయకుడి ప్రమేయం ఉన్నట్లు ఈడీ గుర్తించింది. ముంబైలోని దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ నివాసంలో ఈడీ దాడులు చేసింది. ఈనెల ప్రారంభంలోనే అత్యంత సన్నిహితుడు 1992 ముంబై పేలుళ్లతో సంబంధం ఉన్న అబూ బకర్ ను యూఏఈలో పట్టుకున్నారు. 29 ఏళ్లుగా పరారీలో ఉన్న అబూబకర్ ను అరెస్ట్ చేశారు భారత అధికారులు. ప్రస్తుతం దావుద్ ఇబ్రహీం పాకిస్తాన్ కరాచీలో నివాసం ఉంటున్నాడు. అక్కడి ప్రభుత్వం రాచమర్యాదలతో దావుద్ ను చూసుకుంటున్నారు. భారత్ ఎన్ని ఆధారాలు ఇచ్చినా.. పాకిస్తాన్ పట్టించుకోవడం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version