కేంద్ర కేబినెట్ విస్తరణపై కసరత్తు పూర్తి అయింది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు కేంద్ర కేబినెట్ విస్తరణ జరుగనుంది. ఈ కేబినెట్ విస్తరణలో కొత్తగా 20 మందికి అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. త్వరలో ఎన్నికలు జరగబోయే 5 రాష్ట్రాలకు మంత్రి వర్గంలో ప్రాధాన్యతగా ఇవ్వునున్నారు ప్రధాని మోడీ. కేంద్ర మంత్రి వర్గంలో మొత్తం 81 మందికి అవకాశం కల్పించే యోచనలో ఉంది.
అయితే.. మంత్రి వర్గ విస్తరణతో కొత్తగా ”కేంద్ర సహకార శాఖ”ను కేంద్ర తీసుకువస్తోంది. “సహకారం తో సమృద్ధి” అనే లక్ష్య సాధనకు కొత్త మంత్రిత్వ శాఖను సృష్టించింది మోడి ప్రభుత్వం. దేశంలో “సహకార ఉద్యమాన్ని” మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక పాలనాపరమైన, న్యాయ పరమైన, విధానపరమైన విధివిధానాలను రూపొందించనుంది ఈ మంత్రిత్వ శాఖ. సహకార సంఘాలు మరింతగా బలోపేతమై కిందిస్థాయి వరకు మరింతగా ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు తోడ్పడనుంది కొత్త శాఖ.
అలాగే “బహుళ రాష్ట్ర సహకార సంఘాల” అభివృద్ధికి, సహకార సంఘాల “ఈజీ ఆప్ డూయుంగ్ బిజినెస్” ప్రక్రియలను క్రమబద్ధీకరించేందుకు కృషి చేయనుంది కొత్త “సహకార శాఖ”. సహకార సంఘాల ఆధారంగా “అభివృద్ధి తో కూడిన భాగస్వామ్యం” కు కట్టుబడి ఉందన్న సందేశాన్ని ఇచ్చిన ప్రభుత్వం… కొత్తగా సహకార శాఖ ను ఏర్పాటు చేయడం ద్వారా ఆర్థిక మంత్రి ప్రకటించిన బడ్జెట్ కేటాయింపులకు పూర్తి సార్ధకత లభిస్తుందని ప్రభుత్వ యోచిస్తోంది.