హైదరాబాద్ లో బీజేపీ చేపట్టిన మూసీ నిద్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంబర్ పేట నియోజకవర్గం గోల్నాకకు చేరుకున్నారు. తులసిరాంనగర్ బస్తీలో పర్యటిస్తూ.. బాధితులు, స్థానికులతో మాట్లాడుతున్నారు. మూసీ బాధితులకు తాము అండగా ఉంటామని కిషన్ రెడ్డి వారికి భరోసా ఇస్తున్నారు. రాత్రికి బస్తీ వాసులతో కలిసి భోజనం చేయనున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆ తరువాత అక్కడే నిద్ర చేయనున్నారు.
తులసీరాంనగర్ లో ఇంటింటికి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు కిషన్ రెడ్డి. పేదల ఇల్లు కూల్చకూడదు. పేదలను ఇబ్బంది పెట్టకుండా అఖిల పక్ష సమావేశం పెట్టి మూసీ నదివాసుల సమస్యలను పరిష్కరించాలి. సీఎం రేవంత్ రెడ్డి వేసిన సవాల్ ను స్వీకరించి ఇవాళ రాత్రి పలు ప్రాంతాల్లో మూసీ నది ప్రాంతంలోనే నిద్రిస్తున్నట్టు తెలిపారు. మూడు నెలలు మూసీ ప్రాంతంలో ఉండేందుకు నేను సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి తన సవాల్ ని స్వీకరిస్తారా..? అని ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్ట్ ని విరమించుకుంటే తాను మూడు నెలలు బస్తీల్లో ఉండేందుకు సిద్ధం అని సవాల్ చేశారు.