తెలంగాణలో ఎలాంటి వివక్ష లేని బీజేపీ పాలన వస్తుంది : పీయూష్‌ గోయల్‌

-

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. నేడు రెండో రోజు హెచ్‌ఐసీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటుల చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మోదీ మార్గదర్శకత్వంలో తెలంగాణలోనూ భాజపా సర్కారు వస్తుంది. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధిని భాజపా కాంక్షిస్తోంది. తెరాస ప్రభుత్వంపై వ్యతిరేకత గ్రామ గ్రామాన కనిపిస్తోంది. అవినీతి, కుటుంబ పాలన, బుజ్జగింపులను ఇంక తెలంగాణ భరించదు. తెలంగాణలో ఆర్డినీతి, దాడులు పెరిగాయి.

హుజూరాబాద్లో ఈటలను ఓడించేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. తెరాస ఎన్ని చేసినా హుజూరాబాద్లో ఈటలే గెలిచారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాకు వచ్చిన 50 సీట్లు ట్రైలర్ మాత్రమే. తెలంగాణ ప్రజలకు అవినీతి రహిత ప్రభుత్వం కావాలి. భాజపా ప్రభుత్వం కావాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణలోని అనేక ప్రాజెక్టుల్లో అవినీతి జరుగుతోంది. అవినీతి సొమ్ము అంతా ఎవరి జేబుల్లోకి వెళ్తేంది? ఫామ్ హౌస్ నుంచి ఎంతకాలం ప్రభుత్వం నడవాలి? కేసీఆర్కు జవాబు ఇచ్చేందుకు భారీ సంఖ్యలో భాజపా శ్రేణులు ఇక్కడికి తరలివచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version