అతి చౌకైన కరోనా టెస్ట్ కిట్ ను ప్రారంభించిన కేంద్రమంత్రి రమేష్ పోఖ్రియాల్…!

-

ప్రస్తుతం దేశంలో కరోనా ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అతి చవకైన కరోనా పరీక్ష కిట్ ను కేంద్ర హెచ్ఆర్డి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నేడు ఆవిష్కరించారు. ఇది ఎంతో గొప్ప సంఘటన అని ఆయన అభివర్ణించారు. ఈ కిట్‌ ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ వారు రూపొందించగా దానిని న్యూ టెక్ మెడికల్ కంపెనీ ద్వారా వాణిజ్యపరంగా తయారుచేసి కోరుతూ ‘కోరోసూర్’ అనే పేరుతో మార్కెట్లోకి విడుదల చేశారు. ఇక ఈ కిట్ కేవలం రూ. 650 మాత్రమే ఉంటుందని సదరు సంస్థ ఎండి గోయల్ తెలిపారు.

COROSURE

ఈ పరీక్ష కిట్ రావడంతో భారతదేశంలో మరిన్ని కరోనా పరీక్షలు నిర్ధారణ శరవేగంగా జరుగుతుందని ఆయన తెలియజేశారు. దీనితో కేవలం ఒక నెలలోనే ఏకంగా 20 లక్షలకు పైగా కరోనా పరీక్షలు చేయవచ్చునని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ డైరెక్టర్ రామ్ గోపాల్ రావు తెలియజేశారు. భారత వైద్య పరిశోధన మండలి, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా సంస్థలు ఈ కిట్ ను ఆమోదించినట్లు తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version