తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం..

-

తెలంగాణలో ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం పడింది. సిద్ధిపేట, జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, హన్మకొండ, భూపాలపల్లి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసిన వుదయం తెలిసిందే. అయితే, చాలా చోట్ల పొలాల్లోకి వర్షం నీరు చేరడంతో ధాన్యం తడిసి ముద్దయింది. మామిడి తోటలు ధ్వంసం అయ్యాయి. అకాల వర్షంతో కలిసిన ధాన్యాన్ని చూసి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.చేతికి వచ్చిన పంట నీళ్ల పాలయిందని కన్నీరు విడుస్తున్నారు. పలు చోట్ల ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపోయాయి. విద్యుత్ సరఫరాకు సమస్య ఎదురైంది.

 

జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులో పిడుగు పడి ముత్యం మల్లేశం అనే వ్యక్తి మరణించాడు. తాటి కల్లు తీయడం కోసం వెళ్ళిన మల్లేశం కత్తి నురుతుండగా ఒకేసారి పిడుగు పడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు . జగిత్యాల జిల్లా బీమారం మండలం గోవిందారంలో పిడుగు పడి 20 గొర్రెలు ప్రాణాలు విడిచాయి. సుమారు రెండు లక్షల నష్టం వాటిల్లడంతో రైతు తీవ్ర ఆందోళన కి గురయ్యాడు. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని వేడుకుంటున్నాడు ఆ రైతన్న.

Unseasonal Rains destroys the crop in Telangana.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version