కన్నప్ప సినిమా నుంచి హీరో ప్రభాస్ లుక్ వచ్చేసింది. టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటిస్తున్న పాన్ ఇండియా మూవీ కన్నప్ప. 24 ఫిలిమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు.
అదేవిధంగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, మళయాల స్టార్ మోహన్ లాల్, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేస్తామని గతంలోనే మేకర్స్ వెల్లడించారు. అయితే.. తాజాగా కన్నప్ప సినిమా నుంచి హీరో ప్రభాస్ లుక్ వచ్చేసింది. రుద్ర పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నట్లు ఓ పోస్టర్ వదిలారు. ఇందులో చేతిలో ఓ కర్ర పట్టుకుని.. స్వామిజీ, యోగిలా కనిపిస్తున్నాడు ప్రభాస్. కాగా ఈ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది.
ॐ The Mighty 'Rudra' ॐ
Unveiling Darling-Rebel Star 𝐏𝐫𝐚𝐛𝐡𝐚𝐬 as '𝐑𝐮𝐝𝐫𝐚' 🔱, a force of divine strength, wisdom, and protector in #Kannappa🏹. ✨
Embark on an extraordinary journey of devotion, sacrifice, and unwavering love.
Witness this epic saga on the big screen… pic.twitter.com/wcg7c3ulxd
— Kannappa The Movie (@kannappamovie) February 3, 2025