ఉత్తర్ ప్రదేశ్ బీజేపీలో రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఇద్దరు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా… ప్రస్తుతం మరో మంత్రి యోగీ ఆధిత్య నాథ్ పార్టీకి రాజీనామా చేశారు. మూడు రోజుల్లో ఇది తొమ్మిదో రాజీనామా. ముగ్గురు మంత్రులతో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు, బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా యూపీ మంత్రి వర్గంలో ఉన్న ధరమ్ సింగ్ సైనీ రాజీనామా చేశారు. దీంతో రాజీనామా చేసిన మంత్రుల సంఖ్య మూడుకు చేరింది. ఇప్పటికే ఓబీసీ కీలక నేత మంత్రిగా ఉన్న స్వామి ప్రసాద్ మౌర్య, ధారాసింగ్ చౌహాన్ రాజీనామా చేశారు. బీజేపీ విధానాల వల్ల ఓబిసీలు నష్టపోతున్నారని.. వీరంతా రాజీనామా చేస్తున్నారు. రాజీనామా చేసిన వారంతా.. సమాజ్ వాదీ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. అయితే మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే మరో నెలలో ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు జరగుతున్న సమయంలో ఈ విధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం బీజేపీని కలవరపెడుతోంది. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం మళ్లీ అధికారంలోకి వస్తున్నట్లు సర్వేలు చెబుతున్నప్పటికీ.. వరసగా పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు బీజేపీని వీడుతున్నారు. ఎన్నికల ముందు ఇలా ప్రధాన నేతలు బీజేపీని వీడటం ఎదురుదెబ్బే అని రాజకీయవేత్తలు అనుకుంటున్నారు.