వెళ్ళి చావండి.. స్కూలు ఫీజుల విషయంలో విద్యా శాఖా మంత్రి జవాబు.

-

కరోనా కాలంలో విద్యార్థులు పాఠశాల మొహం కూడా చూడట్లేదు. దాదాపు అంతటా ఆన్ లైన్ క్లాసులే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేవలం ట్యూషన్ ఫీ మాత్రమే తీసుకోవాలని, క్లాసుల నిర్వహణ మొదలైనప్పుడు మాత్రమే వాటికి ఫీజు తీసుకోవాలని ప్రభుత్వాలు విద్యాలయాలకు అనుమతులు జారీ చేసింది. కానీ ఆ అనుమతులను తుంగలో తొక్కుతూ ఉత్తరప్రదేశ్ లోని పాఠశాలలు ఎక్కువ ఫీజు వసూలు చేస్తున్నాయి. ట్యూషన్ ఫీజు మాత్రమే కాకుండా మరింత ఫీజు వసూలు చేస్తూ తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారు.

ఈ విషయంలో ఉత్తరప్రదేశ్ లో తల్లిదండ్రులందరూ విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్ వద్దకి చేరుకున్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని వినిపిస్తున్న తరుణంలో విద్యాశాఖ మంత్రి చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. వెళ్ళి చావండి ఏమి చేసుకుంటారో చేసుకోండి అన్న మాటలు షాకింగ్ గా మారాయి. ప్రభుత్వంలో ఉండి, ప్రజల సమస్యలు చెప్పుకుంటే అలాగే ఉంటుంది, వెళ్ళి చావండి అని మాట్లాడిన మంత్రిపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో తల్లిదండ్రులందరూ ఒక్కటి కావాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version