వైసీపీ నేత వల్లభనేని వంశీ కేసులో మరో కొత్త ట్విస్ట్ వచ్చింది. ఈ కేసులో కీలకంగా ఉన్న సత్యవర్థన్ పై కేసు నమోదు చేసారు. ఈ నెల 11వ తేదీన వంశీ, సత్యవర్దన్ సహా ఐదుగురిపై పోలీసులు FIR రిజిస్టర్ చేసిన విషయం తెలిసిందే. 84/2025 కేసులో ఏ5గా ఉన్నాడు సత్యవర్థన్. అయితే గన్నవరం టీడీపీ నేత మేడేపల్లి రమ ఇచ్చిన ఫిర్యాదుపై వంశీ, కొమ్మా కోట్లు, భీమవరపు రామకృష్ణ, రాజు, సత్యవర్ధన్ లపై కేసు నమోదు చేసుకున్నారు. 232, 351(3), 352 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పటమట పోలీసులు.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ తాజాగా వంశీ బ్యాచ్ బెదిరింపులకు లొంగి 5 లక్షలు తీసుకుని కేసు వాపస్ తీసుకున్నారని రమాదేవి ఫిర్యాదు చేసారు.
వంశీ బ్యాచ్ 5 లక్షలు కేసు వాపస్ తీసుకుంటే ఇస్తానని తమకు చెప్పారని టీడీపీ వాళ్ళతో మాట్లాడి అంతకంటే ఎక్కువ ఇప్పించాలని తమను కోరినట్టు ఫిర్యాదులో పేర్కొన్న రమాదేవి.. పార్టీ తరపున అండగా ఉంటామని చెప్పినా సత్యవర్థన్ వినకుండా కేసు వాపస్ తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వంశీ అతని అనుచరులు డబ్బులకు ప్రలోభ పెట్టి చంపుతామని సత్యవర్ధన్ ను బెదిరించారని ఫిర్యాదు చేసారు.