అయోధ్య కేసు: బాబ్రీ మ‌సీద్ నిర్మించిది ఎవ‌రో చెప్పిన సుప్రీం

-

కొన్ని దశాబ్దాలుగా పరిష్కారం కాని అయోధ్య కేసులో సుప్రీంకోర్టు నేడు ఓ కీలక తీర్పుని వెలువరించింది. అయోధ్య రామజన్మభూమిపై జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ బాబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌ల ధర్మాసనం షియా బోర్డు అప్పీల్ ని కొట్టివేసింది. 1946లో ఫైజాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పు మీద షియా వక్ఫ్ బోర్డు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను కొట్టేసినట్టు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వెల్లడించారు.

దీనిలో సున్నీ వక్ఫ్ బోర్డుకు తీర్పు అనుకూలంగా వచ్చినట్లు తెలిసింది. బాబ్రీ మసీదుని బాబర్ నిర్మించాడన్న షియా బోర్డు. షియా బోర్డు అప్పీల్ ని కోర్టు తిరస్కరించింది. బాబ్రీ మసీదుని బాబర్ సైన్యాధికారులు నిర్మించారని కోర్టు వెల్లడించింది. కాకపోతే సరైన తేదీ తెలియదని ప్రకటన చేశారు. వివాదాస్పద స్థలంపై షియా వక్ఫ్ బోర్డుకు ఎలాంటి హక్కు లేదని చెప్పారు.

కాగా, బాబ్రీ మసీదు సున్నీ వక్ఫ్ బోర్డుదే అంటూ 1946లో ట్రయల్ కోర్టు రూలింగ్ ఇచ్చింది. ఆ మసీదును సున్నీ అయిన బాబర్ నిర్మించలేదని, ఆయన కమాండర్ అయిన షియా నిర్మించాడని షియాబోర్డు క్లెయిమ్ చేసింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేయాలంటూ షియా వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బాబ్రీ మసీదును బాబర్ నిర్మించలేదు అనేది షియా వక్ఫ్ బోర్డు వాదన. బాబ్రీ అంతర్గత నిర్మాణం ఇస్లామిక్ శైలిలో లేదని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version