డెబిట్ కార్డ్ లేకుండానే యూపీఐ యాక్టివేషన్..ఎలాగంటే?

-

కరోనా వచ్చినప్పటి నుంచి అన్నీ చెల్లింపులు యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. ఇప్పుడంతా డిజిటల్ మయం అయ్యింది. ప్రతిసారి డెబిట్ కార్డుతో ఏటీఎం సెంటర్‌కెళ్లి డబ్బు డ్రా చేయాలంటే మనకు కూడా కష్టంగా ఉంటుంది కదా.. అయితే గూగుల్ పే, భీమ్‌, ఫోన్‌పే తదితర యాప్స్‌లో యూపీఐ యాక్టివేషన్ కోసం డెబిట్‌కార్డు తప్పనిసరిగా ఉండేది. అనుకోకుండా డెబిట్ కార్డు ఎక్కడైనా పోతే ఇక అంతే సంగతి. కానీ ఇప్పుడు డెబిట్ కార్డుతో సంబంధం లేకుండా.. ఆధార్ నంబర్‌తో యూపీఐ యాక్టివేట్ చేసుకోవచ్చు. డెబిట్‌కార్డుతో యూపీఐ యాక్టివేషన్ వల్ల ప్రక్రియతో కొన్ని కొత్త పద్ధతులు వచ్చాయి..

చాలా మందికి పలు బ్యాంకులలో అకౌంట్ లు ఉన్నా డెబిట్ కార్డు లేకపోవడంతో లావాదేవీలు జరగక అవస్థలుపడుతున్నారు.. అలాంటి వారి కోసం పీఎన్బీ అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.మీరు యూపీఐ యాక్టివేట్ చేసుకోవడానికి డెబిట్ కార్డు వాడాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డు స్కాన్ చేసి యూపీఐ యాక్టివేట్ చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం https://bit.ly/3V9NOw3ను సందర్శించాల’ని పీఎన్బీ ట్వీట్ చేసింది..

డెబిట్ కార్డు లేని వారు యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై చెల్లింపులు జరుపడానికి ఆధార్ ఓటీసీ బెటర్ తేలిక మార్గం. ఆధార్ కార్డుతో యూపీఐ ప్లాట్‌ఫామ్ రీసెట్ చేసుకోవచ్చు’.పూర్తి వివరాలు..

*. న్యూ యూపీఐ పిన్ సెట్ చేసుకోవడానికి యూపీఐ యాప్ ఎంచుకోవాలి.

*. ధృవీకరణ కోసం ఆధార్ కార్డు సమాచారం నమోదు చేయాలి.
*. కన్సెంట్ ప్రొవైడ్ చేసి, యాక్సెప్ట్ చేయాలి.
*. ఆధార్ కార్డులోని చివరి ఆరు అంకెలను నమోదు చేసి చెల్లుబాటు చేసుకోవాలి.
*. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ నంబర్ నమోదు చేయాలి.
*. కన్సెంట్ ప్రొవైడ్ చేసి, యాక్సెప్ట్ చేయాలి.
*. బ్యాంకు ఖాతా చెల్లుబాటైన తర్వాత కొత్త యూపీఐ పిన్ నంబర్ నమోదు చేసి, ధృవీకరించుకోవాలి.
*. ఎన్పీసీఐ వెబ్‌సైట్ ప్రకారం `ఆధార్ కార్డు నంబర్‌ను ఉపయోగించి ప్రతి యూపీఐ పిన్ నంబర్ సెట్ చేయడానికి కస్టమర్ సమ్మతి తీసుకోవాలి.
*. ఆధార్ కార్డ్ నంబర్‌తో పాటు బ్యాంక్ ఖాతాతో లింక్ చేసిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ నంబర్ వచ్చిన తర్వాత కస్టమర్లు తమ యూపీఐ పిన్ నంబర్లు సెట్ చేసుకోవాలి.. ఇలా చెయ్యడం ద్వారా మనీని సులువుగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు..

 

Read more RELATED
Recommended to you

Exit mobile version