‘ఊరు పేరు భైరవకోన’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

-

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఊరు పేరు భైరవకోన. ఈ చిత్రం కి VI ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ సినిమా కి సంబందించిన రిలీజ్ డేట్ ను మేకర్స్ నేడు అనౌన్స్ చేయడం జరిగింది. చాలా రోజుల తర్వాత ఈ సినిమాకి సంబందించిన అప్డేట్ రావడం విశేషం.

ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9, 2024 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఒక సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. పోస్టర్ ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ఇప్పటికే ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. కావ్య థాపర్, హర్ష చెముడు, రాజశేఖర్ అనింగి, వెన్నెల కిషోర్, మరియు కుశీ రవి ముఖ్యమైన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తుంది. హాస్య మూవీస్ బ్యానర్‌పై రజేష్ దండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version