ప్రస్తుతం భారత ఆర్థిక మాంద్యం చాలా కష్టాల్లో ఉంది. చాలామంది ఆర్థిక నిపుణులు దేశ ఆర్థిక మాంద్యం గురించి కేంద్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన నిర్ణయాలు తీసుకుంటే గాని భవిష్యత్తులో ప్రమాదాలు వాటిల్లే అవకాశాలు ఉండవని చెబుతున్న తరుణంలో అంతర్జాతీయ స్థాయిలో సూపర్ పవర్ కంట్రీ అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్య జరిగిన గొడవ ఆర్థిక కష్టాల్లో ఉన్న ఇండియాపై బాంబు పేల్చి నట్లయింది.
మిడిల్ ఈస్ట్ లో పరిస్థితి చూస్తుంటే ఇరాన్ మరియు అమెరికా దేశాల మధ్య తీవ్రమైన యుద్ధ వాతావరణం అలుముకుంది. ప్రస్తుత పరిస్థితులు బట్టి చూస్తే ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉన్నట్లు దీంతో భారత్ బాగా నష్టపోయే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వినబడుతున్నాయి. ఎందుకంటే ఇరాన్ దేశం నుండి భారత్ చమురులను అత్యధికంగా దిగుబడి చేసుకుంటుంది. అంతేకాకుండా ఇరాన్ దేశంలో భారత్ దేశానికి చెందిన చాలా మంది ఉద్యోగులు కూడా చేస్తున్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణం బట్టి భారత్ కి అన్ని విధాల నష్టాలు వాటిల్లే అవకాశం ఉందని అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వినబడుతున్నాయి. ఈ దెబ్బతో అంతర్జాతీయ చమురు ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అమెరికా సైన్యం ఇటీవల ఇరాన్ మిలటరీ కమాండర్ సులేమానిని హతమార్చారన్న వార్తతోనే ఇరాన్ దేశం తన ఆధీనంలో ఉన్న చమురు ధరలు మరింతగా పెంచే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.