ఇంటిలోనే మొక్కల పెంపకం..లక్షల్లో ఆదాయం..

-

ఈరోజుల్లో ఉద్యోగాలు చేసిన కూడా పెద్దగా ప్రయోజనంలేదు.. ఎంత ఉన్న ఇప్పుడు పెరుగుతున్న ఖర్చుల కారణంగా సరిపోవడం లేదని చాలా మంది అంటారు.మరి కొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు చేస్తారు.ఇంకొంతమంది మాత్రం తమకు ఇష్టమైన మొక్కల పెంపకాన్ని హాబిగా మార్చుకొని లక్షల్లో ఆదాయాన్ని గడిస్తున్నారు..ఇప్పుడు ఓ వ్యక్తి తన ఇంటినే గార్డెన్ గా మార్చుకున్నాడు..అందులో ఒకటి, రెండు కాదు ఏకంగా 10,000 రకాల మొక్కలను నాటాడు.సెంద్రీయ పద్దతులలో పెంపకం చేపట్టనున్నారు. దాంతో మంచి దిగుబడి, అదాయాన్ని పొందుతున్నాడు. ఇక ఆలస్యం ఎందుకు అతని సక్సెస్ స్టోరీ గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

ఉత్తరప్రదేశ్ లోని బరేలీకి చెందిన రాంవీర్ సింగ్ స్నేహితుడి తండ్రి క్యాన్సర్ భారిన పడ్డాడు. అతన్ని పరీక్షించిన వైద్యులు.. తాను తీసుకునే కూరగాయల్లో విషపదార్ధాలు అధికంగా ఉండడంతో శరీరంలో క్యాన్సర్ పేరుకుపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఇది విన్న రాంవీర్ సింగ్ ఆలోచనలో పడ్డాడు. మనకు వచ్చే ఆహార పదార్ధాలు ఎక్కడ పండించినవో తెలియకుండానే వాటిని తింటుంటే అవి విషంగా మారి మనల్ని అనేక విధాలుగా బాధ పెట్టి చంపేస్తున్నాయని, వీటి నుంచి విముక్తి పొందాలని అనుకున్నాడు.ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి బరేలికి 40 కిలోమీటర్ల దూరంలోని తన స్వగ్రామంలో కొంత పొలం తీసుకున్న రాంవీర్, అక్కడ ఆర్గానిక్ పద్ధతుల్లో కూరగాయలు పండించడం ప్రారంభించాడు.

పంటలు బాగానే పండడంతో కొంత మొత్తంలో కూరగాయలను స్థానికంగా అమ్మడం ప్రారంభించాడు. అయితే ఆర్గానిక్ విధానంతో కొంత ఖర్చు, శ్రమ ఎక్కువ అవుతుందని గ్రహించాడు రాంవీర్ సింగ్.హైడ్రోపోనిక్స్ సాగు గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాడు. అతి తక్కువ స్థలంలో మట్టి అవసరం లేకుండానే.. కేవలం నీటి గొట్టాలు, నీరు సరఫరా ద్వారా పంటలు పండించడమే హైడ్రోపోనిక్స్ విధానం. దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన రాంవీర్ సింగ్..బరేలీలోని తన ఇంటి వద్దనే ఈ తరహా సాగు చేయవచ్చని గ్రహించాడు. అనుకున్న వెంటనే హైడ్రోపోనిక్స్ సాగుకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చుకుని అలా కూరాగాయలను పండించాడు..10000 రకాల కూరగాయల మొక్కలను పెంచుతున్నాడు రాంవీర్ సింగ్. వాటిలో బెండకాయ, మిరపకాయలు, క్యాప్సికమ్, సొరకాయ, టమోటాలు, కాలీఫ్లవర్, బచ్చలికూర, క్యాబేజీ, స్ట్రాబెర్రీ, మెంతులు మరియు పచ్చి బఠానీ మొక్కలు పెంచుతున్నాడు..అవి బాగా దిగుబడి ఇవ్వడం తో లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్నాడు.. ఇప్పుడు అందరికి ఆదర్షంగా పిలిచాడు.. వావ్ ..చిన్న ఆలోచన జీవితాన్ని మార్చి వేసింది కదూ..

Read more RELATED
Recommended to you

Exit mobile version