ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ని విడుదల చేసారు. భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖకి చెందిన న్యూఢిల్లీ లోని ఈ సంస్థలో పలు ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 21 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అప్లై చెయ్యచ్చు.
ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్ 23 దరఖాస్తులకు చివరి తేది. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్ వంటి ఖాళీలు ఉన్నాయి. అలానే ఇంటిగ్రేషన్ ఆర్కిటెక్ట్, డిజిటల్ టెక్నాలజీ, ఐటీ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ లో కూడా పలు ఖాళీలు వున్నాయి.
ఈ పోస్టులకి అప్లై చెయ్యాలంటే బీఈ/ బీటెక్, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణత పొంది ఉండాలి.ఈ పోస్టులను బట్టి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 94,000 నుంచి రూ. 2,92000 జీతం వస్తుంది. అభ్యర్థలుకు సంబంధిత పనిలో అనుభవంతో పాటు సంబంధిత నైపుణ్యాలు తప్పని సరి. వయస్సు వచ్చేసి 01-09-2021 నాటికి 23 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. పూర్తి వివరాలని వెబ్‌సైట్‌లో చూసి అప్లై చేసుకోచ్చు.