గుడ్ న్యూస్.. కరూర్ వైశ్య బ్యాంక్ లో ఖాళీలు..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. సొంత గ్రామాలలో బ్యాంక్ ఉద్యోగాలు సాధించుకునే విధంగా కరూర్ వైశ్య బ్యాంక్ మంచి అవకాశాన్ని ఇస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు అప్లై చేసుకోచ్చు. ఎటువంటి పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. కరూర్ వైశ్య బ్యాంక్ ఈ నోటిఫికేషన్ ద్వారా సేల్స్ అసోసియేట్ పోస్టులని భర్తీ చేస్తోంది.

వయస్సు విషయానికి వస్తే.. అభ్యర్థుల వయస్సు 28 ఏళ్ల వయస్సు మించరాదు. ఇక విద్యార్హతలు చూస్తే.. ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైన వారందరు దరఖాస్తు చేసుకో వచ్చు. ఇక ఎలా అప్లై చేసుకోవాలి అన్నది చూస్తే.. అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చివరి తేదీ జూన్ 30, 2022. అధికారిక వెబ్ సైట్ నుండి దరఖాస్తు చేసుకోగలరు. వేతనం రూ 15,000 ఉంటుంది. పూర్తి వివరాలను https://drive.google.com/file/d/1Xwj62bEIt-LmuRzHMhsSidaMmWPfYxbD/view లో చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version