ఫేస్‌బుక్ ద్వారా కూడా టీకా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా..?

-

దేశవ్యాప్తం కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తోంది. రోజూ మూడు లక్షలకుపైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా అధికంగానే ఉంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు పలు రకాల సేవా కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. తాజాగా ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఫేస్‌బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు అండగా.. కోవిడ్-19 లక్షణాలను గుర్తించడంపై సలహాలు, టీకాల గురించి అధికారిక సమాచారం పొందే సేవలను ప్రారంభించింది. భారతదేశంలో కరోనా కేసులు ఎక్కువ నమోదవుతున్న దృష్ట్యా ఇటీవల ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్ స్పందించారు. యూనిసెఫ్‌కు దాదాపు 10 మిలియన్ డాలర్లను విరాళం చేసినట్లు సమాచారం. అలాగే ఫేస్‌బుక్‌లో కోవిడ్-19కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందుపర్చడం జరిగిందన్నారు.

ఫేస్‌బుక్

టెక్ దిగ్గజం ఫేస్‌బుక్‌లో ఇటీవల ఒక పోస్ట్ కనిపించింది. అందులో..‘‘ భారతదేశంలో ప్రస్తుతం కరోనా సేకండ్ వేవ్ తీవ్రతరమైంది. దేశ ప్రజలకు వైద్య సామగ్రిలు, ఇతర ప్రాణాలు కాపాడే సాధానాలను అందిస్తున్నాము. అలాగే ఫేస్‌బుక్ ద్వారా కోవిడ్ సేవలు పొందవచ్చు.’’ అని పేర్కొన్నారు. ఈ వారంలో ఫేస్‌బుక్ మొబైల్ యాప్‌లో ‘మై గవర్నమెంట్ కరోనా హబ్’ పేరుతో భారతదేశంలో ఉన్న వ్యాక్సిన్ కేంద్రాల వివరాలను, సేవలను పొందుపర్చింది. దీని కోసం భారత ప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయనుంది. 17 భాషల్లో టీకా కేంద్రాల గురించి తెలుసుకునే వీలు కల్పిస్తోంది.

ఫేస్‌బుక్‌లో ఈ ఫీచర్ ద్వారా దేశంలో ఉన్న వ్యాక్సిన్ సెంటర్లు, వాటి పని గంటలను తెలపనున్నట్లు భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులోని వాన్ ఇన్ ఆప్షన్ (46 ఏళ్ల కంటే ఎక్కువ), కోవిన్ వెబ్‌సైట్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్‌కు సంబంధించి అపాయింట్‌మెంట్ నమోదు చేసుకోవచ్చు. కోవిన్‌ను సంబంధించిన లింక్‌ను ఫేస్‌బుక్‌లో పొందుపర్చడం జరుగుతుంది. దీంతో వినియోగదారులు సులభంగా ఈ సదుపాయాన్ని పొందవచ్చు.

కాగా, ఏప్రిల్ 29, 2021న ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఒక పోస్ట్ చేశారు. ఇందులో..‘‘నేను భారత ప్రజల గురించి ఆలోచిస్తున్నాను. కరోనా తీవ్రత ఎక్కువ కావడం వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఫేస్‌బుక్‌లో అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలి.’’ అని పేర్కొన్నారు. అలాగే ఫేస్‌బుక్ ప్రస్తుతం యూనిసెఫ్‌తో కలిసి కరోనా నియంత్రణలో భాగస్వామ్యం అయింది. ఆస్పత్రులు, అత్యవసర సదుపాయాల ఏర్పాటుకు రూ.10 మిలియన్లు ఇచ్చారు. టీకా సమాచారం, రిజిస్ట్రేషన్, కోవిడ్ బారిన పడే లక్షణాల గురించి పూర్తి సమాచారాన్ని ఫేస్‌బుక్ ద్వారా పొందవచ్చు. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లోని ఫేస్‌బుక్ ఎక్స్‌ప్లోర్‌లోని గైడ్ల ద్వారా కోవిడ్ సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version