వంశీ చాలా ధైర్యంగా ఉన్నారు. జగన్ లీగల్ గా మేం చూసుకుంటాం అని భరోసా ఇచ్చారు. భయపడవద్దు అని దైర్యం చెప్పారు అని వల్లభనేని వంశీ సతీమణి పంకజశ్రీ తెలిపాడు. అయితే సత్యవర్ధన్ కేసులో 20 వేల కోసం కిడ్నాప్ చేశారని చెప్పారు. వంశీ దగ్గర ఆ 20 వేల రికవరీ కోసం పోలీసులు 10 రోజులు కస్టడీ అడుగుతున్నారు అని తెలిపారు.
ప్రస్తుతం బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాం. చట్ట ప్రకారం ముందుకు వెళ్తున్నాం. సోషల్ మీడియాలో మహిళలపై పోస్టులు పెట్టకూడదు అంటున్నారు. కానీ మా మీద అభ్యంతరకరంగా ట్రోల్ చేస్తున్నారు. ఒక పార్టీకి సంబంధించిన వారే మహిళలా.. మిగతా వాళ్ళు మహిళలు కాదా అని ప్రశ్నించారు ఆమె. దయచేసి మహిళల మీద సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టవద్దు అని అన్నారు. ఇక వంశీ న్యాయవాది చిరంజీవి మాట్లాడుతూ.. ఇవాళ ఎమినిటీస్ కోసం బెయిల్ పిటిషన్ వేశాం. కోర్టులో కొన్ని పిటిషన్లు నడుస్తున్నాయి. కొంత సమయం పట్టొచ్చు అని క్లారిటీ ఇచ్చారు.