నూతన CEC నియామకం కోసం జరిగిన సమావేశంలో అసమ్మతి నోట్ ఇచ్చాను అని రాహుల్ గాంధీ తెలిపారు. కొత్త ఎన్నికల కమిషనర్‌ను ఎంపిక చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీ సమావేశంలో ప్రధానమంత్రికిఅసమ్మతి నోట్‌ను సమర్పించాను. జోక్యం లేని స్వతంత్ర ఎన్నికల కమిషన్ అవసరం, ఇది అత్యంత ప్రాథమిక అంశం అని ఆయన అన్నారు. అలాగే సుప్రీంకోర్టు ఆదేశాన్ని ఉల్లంఘించి, భారత ప్రధాన న్యాయమూర్తిని ప్యానెల్ నుంచి తొలగించడం రాజ్యాంగ విరుద్ధం.
మోడీ ప్రభుత్వం తీరు వల్ల ఎన్నికల ప్రక్రియ పై ఆందోళన తీవ్రతరం అవుతోంది ప్రతిపక్షనేతగా బాబాసాహెబ్ అంబేద్కర్, దేశంకోసం కృషి చేసిన నాయకుల ఆదర్శాలను నిలబెట్టడం, ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచడం నా విధి. ప్యానెల్ కమిటీ ప్రక్రియపై సుప్రీంకోర్టులో సవాల్ చేశాం. 48 గంటలలోపు కేసు విచారణకు రానున్న సమయంలో, కొత్త సిఇసిని ఎంపిక చేయడం సర్యింది కాదు. అర్థరాత్రి కొత్త సీఈసీ నీ ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధం అని రాహుల్ గాంధీ అన్నారు.