పద్మశ్రీ గ్రహీత, వనజీవి రామయ్య మృతి పట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.తన జీవితకాలంలో కోటి మొక్కలకు పైగా నాటారని.. పర్యావరణ పరిరక్షణకు అపారమైన సేవలు అందించి వనజీవి బిరుదు అందుకున్నారని కొనియాడారు.రామయ్య మరణం బాధాకరం అని పేర్కొన్నారు.
రామయ్య తన కుటుంబ సభ్యులకు సైతం చెట్ల పేర్లను పెట్టడం ద్వారా పర్యావరణం పట్ల తనకున్న ప్రేమను చాటుకున్న మహనీయుడని గుర్తుచేశారు.రామయ్య సేవలను గుర్తించి “పద్మశ్రీ” అవార్డుతో సత్కరించి మోడీ ప్రభుత్వం ఆయనకు సరైన గౌరవం అందించిందన్నారు.ఆయన మరణం తెలంగాణకు, పర్యావరణ సమాజానికి తీరని లోటు అని వెల్లడించారు.