మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత. తాజాగా ఆమె మాట్లాడుతూ.. ఏపీలో రక్షకభట నిలయాలు భక్షకభట నిలయాలుగా మారాయని విమర్శించారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్లకు వెళ్లే బాధితులకు న్యాయం దొరకడం లేదని చెప్పారు వంగలపూడి అనిత. ముఖ్యమంత్రి జగన్ న్యాయానికి సంకెళ్లు వేసి, పోలీసులను వీధుల్లోకి విచ్చలవిడిగా వదిలేశారని అన్నారు వంగలపూడి అనిత. ఏలూరు పెదవేగి మండలం వేగివాడలో బాలికపై అత్యాచారం చేసిన నిందితులపై పోలీసులు చర్యలు తీసుకోలేదని.. దీంతో సదరు బాలిక, ఆమె తల్లి ఆత్మహత్య చేసుకున్నారని వంగలపూడి అనిత చెప్పారు.
జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేదని మండిపడ్డారు. న్యాయం జరగక చాలా మంది మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. జగన్ సీఎం అయినప్పటి నుంచి ప్రతి రోజు మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయని వంగలపూడి అనిత చెప్పారు. రాష్ట్రంలో మహిళా హోం మంత్రి, రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు వంగలపూడి అనిత.