చంద్రబాబు అవినీతిపరుడు, దుర్మార్గుడని ఎన్టీఆరే చెప్పారు : వరుదు కల్యాణి

-

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టై ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్నారు. అయితే.. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ టీడీపీ శ్రేణులు నిరసనలు తెలుపుతున్నారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి సైతం నిరసనలు తెలుపుతూ రోడ్డపైకి వస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో అబద్ధాలు చెప్పడంలో నారా భువనేశ్వరి తన భర్త చంద్రబాబును మించిపోయారని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు అతిపెద్ద అవినీతిపరుడు, దుర్మార్గుడని స్వర్గీయ ఎన్టీఆరే చెప్పారన్నారు వరుదు కల్యాణి. పదేపదే మేం నీతిమంతులమని నారా కుటుంబం చెబుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు వరుదు కల్యాణి.

అబద్దాలు చెప్పడంలో చంద్రబాబు, భువనేశ్వరు కుటుంబానికి ఆస్కార్ ఇవ్వాలని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వారిలో చంద్రబాబు, తాము ఉన్నామని వారే చెప్పుకుంటున్నట్లుగా ఉందన్నారు. తమ కుటుంబం ఏనాడు అవినీతి చేయలేదని, ప్రజల సొమ్ముకు ఆశపడలేదని చెబుతున్నారని, కానీ చంద్రబాబు అవినీతిపరుడని మీ తండ్రి చెప్పిన విషయం మరిచిపోయారా? అని నిలదీశారు.

చంద్రబాబు వంటి అవినీతిపరుడి కోసం మీరు దీక్షలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అవినీతి చక్రవర్తికి అబద్ధాల భార్య అనే టైటిల్ పెడితే మీ కుటుంబానికి సరిగ్గా సరిపోతుందని భువనేశ్వరిని ఉద్దేశించి అన్నారు. అక్రమాస్తులు లేవని భువనేశ్వరి పదేపదే చెబుతున్నారని, అయితే 2016లో మీ కుటుంబం ఆస్తి రూ.57 కోట్లు అయితే, ఇప్పుడు హెరిటేజ్‌లో 2 శాతం అమ్మితే రూ.400 కోట్లు వస్తాయని చెబుతున్నారని, దీని ప్రకారం మీ ఆస్తి రూ.20వేల కోట్లుగా ఉందన్నారు. అవినీతి చేయకుంటే ఇంత ఎలా వచ్చిందో చెప్పాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version