VARUN TEJ : జిమ్ లో మెగా హీరో సందడి… కండలు చూపిస్తూ మరీ

-

మెగా హీరో వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగా కుటుంబం నుంచి తెలుగు పరిశ్రమకు  హీరోగా పరిచయమై..  మంచి కథలు ఎంచుకుంటూ తనదైన నటనను కనబరుస్తున్నారు వరుణ్. ఇప్పటికే ఫిదా, గద్దల కొండ గణేష్ మూవీస్ తో మంచి విజయాలు సాధించాడు వరుణ్. ఇప్పుడు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో  మరో మూవీ చేస్తున్నాడు.  వీళ్ళ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ”గని” అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు ఈ సినిమా కోసం బాక్సింగ్ శిక్షణ కూడా తీసుకున్నాడు వరుణ్ తేజ్.

బాక్సింగ్ కోసం విదేశాలకు వెళ్లడం,  ఆ తర్వాత లాక్ డౌన్ విధించడంతో షూటింగ్ వాయిదా పడింది. ఇది ఇలా ఉండగా.. తాజాగా సోషల్ మీడియాలో వరుణ్ ఓ పోస్టర్ రిలీజ్ చేశాడు. “Stand up, Stand out, Stand tall” అంటూ ఆ పోస్టర్ కు క్యాప్షన్ కూడా పెట్టాడు వరుణ్. అయితే ఇప్పుడు ఈ పోస్టర్ సోషల్ మీడియా హల్ చల్ చేస్తోంది. ఈ పోస్టర్ లో వరుణ్ బాడీ బిల్డర్ లా, ఎంతో బలిష్టంగా కనిపిస్తున్నాడు. జిమ్ లో ఎంతో కష్టపడుతున్న వరుణ్ పోస్టర్ పై నెటిజెన్స్ కూడా తమ స్టైల్ లో  స్పందిస్తున్నారు. వాహ్..  వరుణ్ బాడీ బాగుందని కొందరు అంటుంటే.. మరికొందరేమో బాడీ చూసి షాక్ అయినట్లు కామెంట్స్ పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version