పర్యాటకం అంటే పర్యావరణంలో కలిసిపోవడం. నిత్యం బ్రతుకుతున్న దాన్నుండి విడివడి ప్రకృతిలో కలిసిపోవడమే పర్యాటకం. దీనివల్ల కొత్త ఉత్తేజం వస్తుంది. ఉత్సాహం పెరుగుతుంది. జీవితం సరికొత్త దారిని తీసుకుంటుంది. అందుకే ఏడాదిలో ఒక్కసారైనా ప్రకృతితో కలిసిపోవాలి. కరోనా వల్ల ఇప్పటి వరకు సాధ్యం కాలేదు కానీ, ప్రస్తుతం కేసులు తగ్గడంతో పర్యాటకానికి గేట్లు తెరుచుకున్నాయి. ఇలాంటి సమయంలో తక్కువ మందికి తెలిసిన ఎక్కువ ఆనందాన్నిచ్చే ప్రాంతాల్లో ( భారతదేశంలోని పర్యాటక ప్రాంతాలు | Tourist places in India ) పర్యటించడం బాగుంటుంది.
భారతదేశంలోని పర్యాటక ప్రాంతాల గురించి తెలుసుకుందాం.
జవై, రాజస్థాన్
అడవితో పాటు పచ్చదనంలో కలిసిపోవడానికి ఇంతకంటే మంచి ప్రాంతం లేదనే చెప్పాలి. తోడేళ్ళ సఫారీ ప్రత్యేకంగా ఉండే ఈ ప్రాంతంలో ఎలుగు బంట్లు, నక్కలు, హైనాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. పక్కనే నది ఉండడం వల్ల ఈ ప్రాంతానికి మరింత అందం వచ్చింది.
జీరో వ్యాలీ, అరుణాచల్ ప్రదేశ్
అపతామీ అనే తెగ ప్రజలు ఉండే ఈ ప్రాంతం సరికొత్త సంస్కృతిని పరిచయం చేస్తుంది. కొండ ప్రాంతాల్లో అక్కడక్కడ కనిపించే మైదానాల్లోని వరిపొలాలు, కొండజాతులు కొత్త ప్రపంచంలోకి తీసుకువెళతాయి.
మొరాచీ చించోలీ, మహారాష్ట్ర
పుణె నుండి కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్రాంతం అనధికారిక నెమళ్ళ పర్యవేక్షణ కేంద్రంగా పిలవచ్చు. ఎన్నో చింత చెట్ల నడుమ నెమళ్ళ నాట్యాలు కనువించు చేస్తుంటాయి. ఇక్కడకి వెళ్ళడానికి గుర్రపు బండి మీద వెళ్ళాల్సి ఉంటుంది. అదో ప్రత్యేక అనుభూతిగా నిలుస్తుంది.
వర్కల, కేరళ
దక్షిణ కేరళలో ఉండే ఈ ప్రాంతం సముద్ర తీరాలకు ప్రసిద్ధి. ఎరుపు రాయితో ఉన్న సముద్రపు కొండలు అందంగా ఉంటాయి. నల్లటి ఇసుకతో ఏర్పడ్డ బీచ్ ప్రముఖంగా కనిపిస్తుంది. 2వేల సంవత్సరాల క్రితం నాటి జగన్నాథ స్వామి మందిరం, శివగిరి మఠం ప్రత్యేక ఆకర్షణ.