వైసీపీకి షాక్‌…జాతీయ మహిళా కమిషన్ కు వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు !

-

Vasireddy Padmas complaint to the National Commission for Women: వైసీపీకి షాక్‌ తగిలింది. జాతీయ మహిళా కమిషన్ కు వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో మహిళల పట్ల సాగుతున్న వికృత దాడిపై కఠిన చట్టం కోసం సుప్రీం కోర్టులో పిల్ వేయాలని జాతీయ మహిళా కమిషన్ ను కోరారు వాసిరెడ్డి పద్మ.

Vasireddy Padmas complaint to the National Commission for Women

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో సీఎం, డిప్యుటీ సీఎం కుటుంబాలపై ,మహిళా హోంమంత్రి, రాజకీయ పార్టీల మహిళా నేతలపై సోషల్ మీడియాలో విషం చిమ్ముతున్నారని ఆమె ఫైర్‌ అయ్యారు. పసలేని చట్టాలతో ఈ సైకోల దాడి నుండి మహిళలను కాపాడలేమని తెలిపారు.

సోషల్ మీడియాపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను రివ్యూ చేయాలని NCW కు రాసిన లేఖలో పేర్కొన్నారు వాసిరెడ్డి పద్మ. తక్షణమే జాతీయ మహిళా కమిషన్ సుప్రీం కోర్టులో పిల్ వేసి కఠినమైన చట్టం అమలుకు పూనుకోవాలని కోరారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ.

Read more RELATED
Recommended to you

Exit mobile version