వాస్తు: ఆవ నూనెతో ఆర్ధిక సమస్యలకి చెక్..!

-

వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటాం. వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు మనకి ఆర్ధిక సమస్యలకి సంబంధించిన కొన్ని విషయాలను చెప్పారు. మరి వాటి కోసం ఈరోజు తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం దీపాన్ని వెలిగిస్తే వాస్తు దోషాలు తొలగిపోతాయి. పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. ఇంట్లో లవంగాలను కూడా ఉంచడం మంచిది. ఆవ నూనె తో దీపాన్ని వెలిగిస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలానే ఆర్ధిక నష్టం వంటి ఇబ్బందులు వంటివి తొలగిపోతాయి.

అదే విధంగా సాయంత్రం పూట లైట్లను వెలిగించడం దీపాలను పెట్టడం వలన మంచి కలుగుతుంది. లక్ష్మీ దేవి ఇంట్లోకి వస్తుంది. అలానే వాస్తు శాస్త్రం ప్రకారం వారానికి ఒకసారి ఇంట్లో ధూపం వేస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఆనందం కలుగుతుంది. ప్రశాంతంగా ఉండొచ్చు.

కర్పూరన్ని వెలిగిస్తే కూడా చాలా మంచి కలుగుతుంది. కాబట్టి ఇలా కూడా మీరు చెయ్యచ్చు. అలానే మీరు ఆహారాన్ని తీసుకుంటే ఆహారాన్ని తీసుకునే ముందు ఆవుకి ఆహారం ఇవ్వండి. తులసి మొక్కకి పూజించడం వలన కూడా చాలా మంచి కలుగుతుంది. ఇలా ఈ లాభాలని పొందవచ్చు కనుక వీటిని అనుసరిస్తూ ఉండండి దానితో ఆనందంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version