వాస్తు: వంటింట్లో ఈ మార్పులు చేస్తే సమస్యలే వుండవు..!

-

ఇంట్లో వాస్తు శాస్త్రాన్ని పాటిస్తే సమస్యలు తొలగిపోతాయి. ఏదైనా సమస్యతో మీరు చాలా కాలం నుండి ఇబ్బంది పడుతున్నట్లు అయితే వాస్తు చిట్కాలను పాటించండి. వాటితో వెంటనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అయితే ఈ రోజు మన వాస్తు పండితులు కొన్ని ముఖ్యమైన చిట్కాలని చెప్పారు. వంటగదిలో పండితులు చెబుతున్న విధంగా మీరు అనుసరించారు అంటే కచ్చితంగా సమస్యల నుండి బయట పడవచ్చు. అయితే మరి ఆ వాస్తు చిట్కాల గురించి ఇప్పుడే చూసేద్దాం.

 

వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మార్పులు చేస్తే చాలా మంచిది. వంట గదిలో డైనింగ్ టేబుల్ పెట్టుకోవడం మంచిది కాదు. ఒకవేళ మీ ఇంట్లో వంట గదిలో డైనింగ్ టేబుల్ ఉంటే తొలగించడం మంచిది. అలాగే వంట గదిలో ఉండే సిలిండర్ మరియు స్టవ్ ఆగ్నేయం వైపు ఉంటే మంచిది.

కాబట్టి కచ్చితంగా స్టవ్ మరియు సిలిండర్ ఆగ్నేయం వైపు ఉండేటట్లు చూసుకోండి. అలానే వంట గదిలో ఉండే కుళాయిలు ఎప్పుడూ కూడా లీక్ అవ్వకూడదు. దీని వల్ల ధన నష్టం కలుగుతుంది కనుక ఒకవేళ కుళాయిలు రిపేర్ అయ్యి ఉంటే వాటిని చేయించండి. మైక్రోవేవ్ ఎప్పుడూ కూడా ఆగ్నేయం వైపు ఉంచుకోవాలి.

ఫ్రిడ్జ్ ని ఎప్పుడూ కూడా ఆగ్నేయం లేదా దక్షిణం వైపు ఉంచుకోవాలి. లేదు అంటే పడమర ఉత్తర దిక్కుల్లో కూడా మంచిదే. ఇక వంట గదిలో రంగుల విషయానికి వస్తే… వంట గదిలో పసుపు, ఆకుపచ్చ, ఎరుపు, చాక్లెట్ లేదా ఆరెంజ్ రంగులు వేస్తే మంచిది. కాబట్టి ఈ రంగులు వేయించుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి ఇలాంటి మార్పులు చేస్తే ఖచ్చితంగా ఇంట్లో సమస్యలు దూరం అవుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version