వాస్తు: ఆఫీస్ లో ఈ తప్పులు చేస్తే నష్టం కలుగుతుంది..!

-

వాస్తు శాస్త్రం ప్రకారం కనుక ఫాలో అయ్యారంటే మంచి కలుగుతుంది. ఇబ్బంది కానీ ఏమైనా సమస్య కానీ ఉంటే వాస్తు తో పరిష్కరించుకోవచ్చని పండితులు చెబుతున్నారు. అయితే ఈ రోజు వ్యాపారంలో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఆఫీసులో ఎలాంటి పద్ధతులని పాటించాలి, ఏ విధంగా పాటించడం వల్ల శుభం కలుగుతుంది అనేది పండితులు వివరించారు. మరి ఆలస్యమెందుకు పండితులు చెబుతున్న అద్భుతమైన చిట్కాలు గురించి ఇప్పుడు మనం చూద్దాం.

 

వాస్తు శాస్త్రం ప్రకారం యజమాని రూము ఎప్పుడూ కూడా ఆఫీసుకి ఎదుటగా ఉండకూడదు. ఆఫీస్ లోపలికి వెళ్ళగానే ఏదైనా గది ఉండి ఆ తర్వాత ఎజమాని గది ఉండాలి. అదే విధంగా లోపలికి వెళ్లగానే టేబుల్ వంటివి అడ్డుగా ఉండకూడదు. ఒకవేళ కనుక ఇలా ఉంటే ఈ తప్పును సరి చూసుకోండి. లేదంటే ఇబ్బంది వస్తుంది.

ముఖ ద్వారానికి టేబుల్ కి మధ్య గ్యాప్ ఎక్కువగా ఉండేటట్లు చూసుకోండి. అలాగే ఉత్తరం వైపు లక్ష్మీదేవి ఉండేటట్లు చూసుకోండి. అంటే డబ్బులు దాచుకుని టేబుల్ ఎప్పుడూ కూడా ఉత్తరం వైపు ఫేసింగ్ చేసి ఉండాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఆర్థిక నష్టం వంటి సమస్యలు రాకుండా ఉంటుంది. ఇక రంగుల విషయానికి వస్తే.. లేత రంగులు ఆఫీస్ కి వేసుకోవడం మంచిది. తెలుపు రంగు, క్రీమ్ కలర్, లైట్ పసుపు రంగు ఆఫీస్ కి వేస్తే మంచిది. అదే విధంగా ఈశాన్యం వైపు నీళ్లు పెట్టాలి. ఇలా ఆఫీసులో ఈ తప్పులు చేయకుండా వీటిని పాటిస్తే ఏ ఇబ్బంది లేకుండా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version