వాస్తు: సమస్యలతో సతమతమవుతున్నారా..? అయితే ఉప్పుతో ఇలా తొలగించచ్చు..!

-

చాలా మంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు ప్రతి ఒక ఇంట్లో కూడా ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. కొందరికి ఆర్థిక ఇబ్బందులు అయితే మరి కొందరికి ఒత్తిడి పెరిగిపోవడం లేదంటే అదృష్టం కలిసి రాకపోవడం కెరియర్ లో పైకి రాకపోవడం ఇలా.. అయితే ఈ రోజు పండితులు మనతో కొన్ని వాస్తు చిట్కాలు ని చెప్పారు వీటిని అనుసరించడం వలన చాలా సమస్యలు కి దూరంగా ఉండొచ్చు. మరి పండితులు చెప్పిన అద్భుతమైన వాస్తు చిట్కాలు గురించి ఇప్పుడు చూద్దాం.

వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు చాలా సమస్యలను తొలగిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీళ్ల లో ఉప్పుని వేసి ఇల్లు కడిగితే మీ ఇంట లక్ష్మీ దేవి ఉంటుంది ప్రతి రోజు ఇలా చేయక్కర్లేదు వారానికి రెండు మూడు సార్లు చేసిన సరిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.

బాత్రూం లో కూడా మీరు ఉప్పు వేసి క్లీన్ చేయొచ్చు. ఇది కూడా నెగటివ్ ఎనర్జీ ని తొలగించేందుకు సహాయపడుతుంది.

మీ ఇంట చంటి పిల్ల ఉంటే చెడు ప్రభావం తన మీద పడకుండా ఉండేందుకు స్నానం చేసేటప్పుడు నీళ్లలో ఉప్పు వేసి దానితో స్నానం చేయించండి అప్పుడు దిష్టి తగలకుండా ఉంటుంది. ఉప్పు చాలా రకాల అనారోగ్య సమస్యలను తొలగిస్తుంది కూడా.

అలానే అనారోగ్య సమస్యలు వంటివి తరచు మీ ఇంట్లో వస్తూ ఉంటే ఒక సీసాలో ఉప్పు వేసి ఇంట్లో ఒక చోట ఉంచండి అది సమస్యలని తొలగించేందుకు సహాయం చేస్తుంది. ఇలా ఈ విధంగా అనుసరిస్తే ఇబ్బందులు ఏమీ లేకుండా ఆనందంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version