వాస్తు టిప్స్: కెరీర్ లో ఎదగడానికి పనికొచ్చే కొన్ని వాస్తు సలహాలు..

-

మహమ్మారి వచ్చిన తర్వాత మీరు జాబ్ కోల్పోయారా?

సాలరీ పెరుగుతుందేమో అన్న ఆశతో ఎదురుచూస్తున్నారా?

మీ కెరీర్ లో ఇంకా ఎదగాలని ఆశపడుతున్నారా?

వీటన్నింటికీ వాస్తు శాస్త్రం ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. మీరు ఉద్యోగం చేసేటపుడు పాటించాల్సిన కొన్ని వాస్తు నియమాలు మీ కెరీర్ ని ఎలా ఉండాలనేది నిర్ణయిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. ప్రస్తుతం మీ కెరీర్ బాగుండడానికి పాటించాల్సిన కొన్ని వాస్తు నియమాలని ఇక్కడ చూద్దాం.

ఉద్యోగం చేసే స్థలంలో మీరు కూర్చునే సీటు ఆగ్నేయానికి ఎదురుగా ఉండేలా చూసుకోవాలి. అంటే ఆగ్నేయానికి ముఖం పెట్టి పని చేసుకునేలా ఉండాలి. ఇంకా మీరు ల్యాప్ టాప్ పెట్టుకున్న కుర్చీపై ఛార్జింగ్ కేబుల్స్ కనిపించకూడదు. వాటిని కనిపించకుండా ఉండేలా చూసుకోవాలి.

కుర్చీలో కూర్చున్నప్పుడు కాళ్ళు ఒకదానిపై ఒకటి వేసుకోవద్దు. అది మీ కెరీర్ కి ఆటంకం కలిగించే సంకేతం అని వస్తు శాస్త్రం చెబుతుంది. ఇంటి వద్ద నుండి పనిచేసినా, ఆఫీసు నుండి చేసినా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.

ప్రస్తుతం ఇంట్లో నుండి పనిచేయడం కామన్ అయిపోయింది. కాబట్టి ఇంట్లో నుండి పనిచేసేటపుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు కూర్చునే, పనిచేసుకునే గది పడకగది పక్కనే ఉండకూడదు. అలాగే మీ డెస్క్, చతురస్రం, లేదా దీర్ఘచతురస్రం ఆకారంలో ఉండాలి. గుండ్రంగా, వృత్తాకారంలో ఉండకూడదు.

ఏదైనా స్పటిక పదార్థాలను మీ డెస్క్ మీద ఉంచుకుంటే బాగుంటుంది. సానుకూల వాతావరణాన్ని కలిగించడంలో స్పటికం చాలా ఉపయోగపడుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది.

వాస్తు పట్ల నమ్మకం ఉన్నవారు పై విషయాలు పాటించడం వల్ల కెరీర్ లో అభివృద్ధి ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version